BREAKING : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేసింది.
మస్తాన్ వలి, జంగా గౌతమ్, రాకేష్, సుంకర పద్మశ్రీలను వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా నియమించింది. మాజీ కేంద్రమంత్రి పళ్ళం రాజుకు ప్రోగ్రాంల కమిటీ చైర్మన్, తులసి రెడ్డికి మీడియా కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. మాజీ ఎంపీ హర్ష కుమార్ ను ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించింది.