బాలికకు ప్రేమ వేధింపులు.. ఇంట్లోకి వచ్చి మరీ!.. సూసైడ్

-

ప్రేమ వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.రంగనాయకుల గుట్ట ప్రాంతానికి చెందిన బాలిక(13) మంగళవారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకివెళితే.. కనుగూరి విజయ్, తిరుపతమ్మ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరి చిన్న కుమార్తె స్థానిక స్కూల్​లో 9వ తరగతి పూర్తి చేసింది.

స్థానికంగా ఉండే పానుగోటి రోహిత్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమపేరుతో బాలికను వేధిస్తున్నాడు. రోహిత్ తన తమ్ముడి ఇన్​స్టా గ్రామ్​ నుంచి బాలికకు అసభ్యకరమైన మెసేజ్‌లు కూడా పంపినట్లు యువతి తండ్రి వెల్లడించారు. రోహిత్ మీద చర్యలు తీసుకోవాలని మీనాక్షి ఫ్యామిలీ రెండు రోజుల కిందట హయత్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. సోమవారం బాలిక ఇంట్లో ఎవరూ లేని టైంలో రోహిత్ వెళ్లి మీనాక్షిని బెదిరించినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news