పెళ్లి చేస్తామని మోసం.. యువతిని 50 వేలకు అమ్మేశారు !

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలకు అంతం లేదనే అనిపిస్తోంది. తాజాగా ఒక మంచి కుటుంబంలో వివాహం జరిపిస్తామని చెప్పి నమ్మించి ఒక అమ్మాయిని తీసుకు వచ్చిన ఓ జంట ఆమెను 50,000 కు విక్రయించింది. బాధితురాలిని షాజహన్‌పూర్ జిల్లా నుంచి తీసుకువచ్చి బడాన్‌ లో ఒక వ్యక్తికి అమ్మారు. ఈ విషయం గ్రహించిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొనుగోలు చేసిన వ్యక్తితో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన బుధవారం బడాన్‌లోని ఉషైట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాడియా హర్డోపట్టి గ్రామంలో జరిగింది.

గ్రామ నివాసి రాజ్‌వీర్ బాలికను రూ .50 వేలకు కొన్నట్లు హిందీ దినపత్రిక హిందూస్థాన్‌ ఒక కధనం ప్రచురించింది. మంజు దేవి మరియు కృష్ణ పాల్ షాజహాన్పూర్ లోని యువతిని మంచి కుటుంబంలోని వ్యక్తికీ ఇచ్చి వివాహం చేసుకుంటానని ఆమెను బడాన్ కి తీసుకువచ్చారు. తర్వాత మరో వ్యక్తితో బేరం కుదుర్చుకుని అమ్మారు. అయితే ఆమెకు మాత్రం పెళ్లి అని భ్రమ కల్పించారు. ఆమెను విక్రయించినట్లు తర్వాత గ్రహించారు. అనంతరం ఆమె పోలీసులను సంప్రదించి ముగ్గురు నిందితులపై ఫిర్యాదు చేసింది. ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version