గాడిదలకు గడ్డి వేసి.. ఆవులకు పాలు పిండితే రావు – సీఎం కేసీఆర్

-

నేడు మునుగోడు నియోజకవర్గం చండూరులో టిఆర్ఎస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభకి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాదు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో చండూరుకు బయలుదేరిన సీఎం సభ ప్రాంగణానికి చేరుకున్నారు. సభా వేదిక మీదికి చేరుకున్న సీఎం కేసీఆర్.. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాలవేసి సభా ప్రాంగణంలో గులాబీ జెండాను ఎగురవేశారు.

అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ బ్రోకర్ గాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామనుకున్నారని.. రూ. 100 కోట్లు ఇస్తామంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎడమ కాలితో తన్నారని అన్నారు. ఎడమ కాలు చెప్పుతో కొట్టినట్లు వారికి బుద్ధి చెప్పారని తెలిపారు. రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని మా ఎమ్మెల్యేలు నిరూపించారని చెప్పుకొచ్చారు.

అంగట్లో పశువుల్లా అమ్ముడుపోకుండా ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడారని కొనియాడారు. మునుగోడు లో ఈ ఉపఎన్నిక అవసరం లేకుండా వచ్చిందన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు సీఎం కేసీఆర్. గాడిదలకు గడ్డి వేసి.. ఆవులకు పాలు పిండితే రావన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version