గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గల కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో తరగతులు బహిష్కరించి విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనకు దిగారు.
కొత్తగా నియామకాల కోసం ఇచ్చిన జీవో 21ను రద్దు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాలలో పనిచేసే 1,270 అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని వారు మంగళవారం డిమాండ్ చేశారు. వర్సిటీ ఎదురుగా బైఠాయించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా, గతంలో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన సీఎం రేవంత్.. ఇక మీదట కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం కుదరదని పేర్కొన్న విషయం తెలిసిందే.