ఏపీ పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. పాపిరెడ్డిపల్లిలో ‘ఎప్పుడూ చంద్రబాబు పాలన కొనసాగదు. చంద్రబాబుకు ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతలు దిగజారాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.

YS Jagan warns AP police

తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లోనూ దౌర్జన్యాలు చేశారు’ అని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. పోసాని కృష్ణ మురళిపైనా కేసులు పెట్టి వేధించారు.. నంది అవార్డుల విషయంలో పోసాని చేసిన వ్యాఖ్యలతో టీడీపీ ప్రభుత్వం కుట్రపూరిత కేసులు పెట్టిందని ఫైర్ అయ్యారు. వల్లభనేని వంశీపైనా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు వైఎస్ జగన్.

Read more RELATED
Recommended to you

Latest news