నకిలీ జాయింట్ కలెక్టర్ హల్‌చల్.. సచివాలయానికే వెళ్లి..!!

-

అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలో జాయింట్ కలెక్టర్ (జేసీ) పేరిట ఓ మహిళ హల్‌చల్ చేసింది. చింతర్లపల్లి, ములకలేడు, తిప్పనపల్లి సచివాలయాలను తనిఖీ చేసి.. సచివాలయాల జేసీగా బాధ్యతలు చేపట్టానంటూ సిబ్బంది హాజరు పట్టిక, బయోమెట్రిక్‌పై ఆరా తీసింది. తన పేరు సింధూరి జంపాల అని తెలిపింది. అనంతరం శెట్టూరు పీహెచ్‌సీకి వెళ్లి.. వైద్యుడి కుర్చీలో కూర్చుంది. ఆస్పత్రి సిబ్బంది వివరాలు, మందుల నిల్వ వివరాలను అడిగి తెలుసుకుంది.

నకిలీ జాయింట్ కలెక్టర్

అయితే సచివాలయాల సిబ్బంది ఈ విషయాన్ని తహసీల్దార్ శంకరయ్య, ఎంపీడీఓ వెంకటనాయుడు, ఎస్ఐ యువరాజ్‌కు తెలిపారు. దీంతో వారందరూ పీహెచ్‌సీకి చేరుకుని ఆమెను ప్రశ్నించారు. జేసీ హోదాతోనే తనిఖీ చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో తహసీల్దార్ కలెక్టరేట్‌కు ఫోన్ చేశారు. సింధూరి జంపాల పేరుతో జాయింట్ కలెక్టర్ ఎవరూ జాయిన్ కాలేదని తెలిపారు. దీంతో ఆమె నకిలీగా నిర్ధారించుకుని కలెక్టరేట్‌కు తీసుకెళ్లారు. అక్కడ జేసీ కేతన్‌గార్గ్ ఆమె వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version