ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలు షాక్ ఇస్తాయా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. విశాఖలో సచివాలయం, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్ట్ అంటూ జగన్ చేసిన ప్రకటన తర్వాత రాజధానికి అత్యంత దగ్గరగా ఉన్న గోదావరి జిల్లాల నుంచి పెద్దగా స్పందన అనేది రాలేదు. వంద కిలోమీటర్ల లోపే గోదావరి జిల్లాలు రాజధానికి దగ్గరగా ఉన్నాయి. అయినా సరే పది రోజుల నుంచి జరుగుతున్న రాజధాని ఉద్యమంలో మద్దతు ఇవ్వడ౦ లేదు.
వాళ్లకు హైకోర్ట్ కి వెళ్ళాలి అంటే 500 కిలోమీటర్లు, విశాఖ వెళ్ళాలి అంటే 400 కిలోమీటర్ల దూరం ఉంది. అయినా సరే రాజధాని ప్రాంత రైతులకు మద్దతు ఇవ్వడానికి వాళ్ళు ముందుకి రావడం లేదనే అభిప్రాయం వినపడుతుంది. అసలు దానికి కారణం ఏంటీ అనేది ఒకసారి చూస్తే, రాజధాని అమరావతిగా ప్రకటించిన తర్వాత ఉభయగోదావరి జిల్లాలకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదనే అభిప్రాయం వాళ్ళలో ఉంది. ఇంకా పట్టిసీమ నీళ్ళనే కృష్ణా నదిలోకి తీసుకువెళ్ళారు గాని తమకు ఏమీ న్యాయం జరగలేదు అనే భావనలో వాళ్ళు ఉన్నారు.
వచ్చిన కంపెనీలు అన్ని గన్నవరం దగ్గరే ఆపేశారు గాని ఏలూరు వరకు కూడా రాలేదనే భావనలో వాళ్ళు ఉన్నారు. రాజమండ్రి పేరు మార్చడం మినహా ఏమీ జరగలేదని, అత్యంత సుందరమైన నగరం రాజమండ్రని, ఆ నగరానికి కూడా న్యాయం జరగలేదనే భావనలో వాళ్ళు ఉన్నారట. ఇక సముద్రతీర నగరంగా ఉన్న కాకినాడ కు న్యాయం అనేది పెద్దగా జరగలేదనే భావనలో వాళ్ళు ఉన్నారు. రాజధాని దగ్గరగా ఉందనే పేరు మినహా తమకు వచ్చిన చిన్న ప్రయోజనం ఏమీ లేదని కాబట్టి, జగన్ నిర్ణయంపై వాళ్ళు సంతోషంగానే ఉన్నారని అంటున్నారు.