కేసీఆర్ తరువాత కేటీఆరే సీఎం.. తేల్చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

తెలంగాణలో కేసీఆర్ తరువాత కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… తెలంగాణలో కేసీఆర్ తరువాత ఎవరంటే ఎవరైనా కేటీఆర్ అనే చెబుతారని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. దేశం కేసీఆర్ వైపు.. యువత కేటీఆర్ వైపు చూస్తోందన్నారు. కేసీఆర్ తరువాత అంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడు, విశ్వసనీయత ఉన్న వ్యక్తి కేటీఆర్ అని అన్నారు. కేటీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని ఆయన గుర్తు చేశారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం కావడం సహజమేనన్నారు. ఇక మరో పదేళ్ల తరువాతైన కేసీఆర్ తరువాత ఎవరంటే కేటీఆర్ అనే చెబుతారని తెలిపారు.

ఆయన దీనిపై తుది నిర్ణయం తమ పార్టీ నాయకుడే తీసుకుంటారని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మ‌రోవైపు ‘జనవరి 30న కేసీఆర్ సభ పెడతారని ఎవరు చెప్పారు?. ఓ పత్రికలో వచ్చిన వార్త చూసి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. మతం పేరుతో సమాజాన్ని, మనుషులను విడదీస్తే టీఆర్‌ఎస్ సహించదు. సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. సీఎంను అన్ని పార్టీల నేతలు కలవొచ్చు. ఏ ఎన్నికలు వచ్చినా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. భార్యనే గెలిపించుకునే సత్తా లేని ఉత్తమ్.. మాపై విమర్శలు చేయడమేంటి?’ అని ప్రతిపక్షాలపై శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version