గోదావరి నది..ఉగ్ర రూపం దాల్చింది. దింతో జలదిగ్బంధంలో బాసర ఉంది. బాసర ఆలయ పరిసరాలు, సమీప దుకాణం సముదాయాలు, గెస్ట్ హౌస్ లు జలమయమయ్యాయి. వ్యాస మహర్షి దేవాలయాన్ని తాకాయి గోదావరి జలాలు. ఆలయ సందర్శనకు రావొద్దని భక్తులకు అధికారులు సూచనలు చేసారు.

బాసరలో వరద బీభత్సం సృష్టించిన తరుణంలోనే 50పైగా షాపులు నీట మునిగాయి. కాగా, అదిలాబాద్ కొత్తగూడెం హనుమకొండ జగిత్యాల భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల మెదక్ ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి సిరిసిల్ల వరంగల్ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నది.. జలదిగ్బంధంలో బాసర..
జలమయమైన ఆలయ పరిసరాలు, సమీప దుకాణం సముదాయాలు, గెస్ట్ హౌస్ లు
వ్యాస మహర్షి దేవాలయాన్ని తాకిన గోదావరి జలాలు
ఆలయ సందర్శనకు రావొద్దని భక్తులకు అధికారుల సూచన pic.twitter.com/MeXV5U0KGs
— BIG TV Breaking News (@bigtvtelugu) August 30, 2025