రిషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రిషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకురావడానికి ముగ్గురు మంత్రులతో కమిటీ వేసిన ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ కమిటీ సభ్యులుగా మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు.

నిన్న రిషికొండ భవనాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అటు విశాఖపట్నంలో ”సేనతో సేనాని” కార్యక్రమాలలో పాల్గొంటున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఋషికొండ ప్యాలెస్ ను పరిశీలించారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పవన్ కళ్యాణ్ ఋషికొండలోని భవనాలను దగ్గర ఉండి పరిశీలించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రుషికొండ భవనాలు దెబ్బతిన్నాయన్నారు.