ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. భారీగా దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

రెండు రోజులుగా దిగొస్తున్న బంగారం ధ‌ర‌.. ఈ రోజు కూడా ప‌డిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర భారీగా దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.370 పడిపోయింది. దీంతో పసిడి ధర రూ.37,640కు దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇంకా భారీగా పతనమైంది. ఈ పసిడి ధర ఏకంగా రూ.400 దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.41,060కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.100 దిగొచ్చింది. దీంతో ధర కేజీకి రూ.48,900కు క్షీణించింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పడిపోయింది. దీంతో ధర రూ.38,450కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 క్షీణించింది. దీంతో ధర రూ.39,650కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.48,900కు పతనమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version