నిన్న దిగొచ్చిన బంగారం ధర ఈ రోజు కూడా అదే బాట పట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం కూడా దిగొచ్చింది. రూ.100 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.41,980 నుంచి రూ.41,880కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.38,480 నుంచి రూ.38,380కు క్షీణించింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం అక్కడే స్థిరంగా ఉంది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.48,000 వద్దనే నిలకడగా కొనసాగుతోంది.
ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 క్షీణించింది. దీంతో ధర రూ.39,200కు తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.40,400కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.48,000 వద్దనే ఉంది.