మెడలో మెడిసిన్‌ కట్టుకోండి.. కరోనాకు చెక్‌ పెట్టుకోండి

-

 

కరోనా వైరస్‌. ఒకరి నుంచి మరొకరికి వేగంగా అంటుకున్న ఈ వైరస్‌ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్నది. ఈ వ్యాధికి మెడిసిన్‌ తయారు చేయడానికి చైనా సహా పలుదేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్మశాలలోని ‘మీన్‌ త్సీ ఖాంగ్‌’ అనే టిబెటన్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు.. కరోనాను నిరోధించడానికి తోడ్పడే ఓ టాబ్లెట్‌ను కనిపెట్టారు.

 

మెడికల్‌ సెంటర్‌కు చెందిన డా. టెంజిన్‌ యెషీ అఏ పరిశోధకుడు ఈ ఔషధం గురించి వివరిస్తూ.. ‘మేము ఈ మెడిసిన్‌ను ఐదు రకాల మూలికలతో తయారు చేశాం. ఇది నోటిద్వారా తీసుకునేది కాదు. దీన్ని ముందుగా నల్లనిగుడ్డలో చుట్టాలి. తర్వాత అందులోని ఐదు రకాల మూలికలకు గుర్తులైన ఐదు రకాల దారాలను ఆ నల్లగుడ్డ చుట్టూ కట్టాలి. ఆ తర్వాత దీన్ని హారంలా మెడలో వేసుకుంటే సరిపోతుంది. ఈ మెడిసిన్‌లో సుగంధాలు గుప్పుమంటూ పరిమళాలను వెదజల్లుతాయి. ఈ బలమైన సువాసనకు కరోనా వైరస్‌ను నిరోధించే శక్తి ఉంది.’ అని చెప్పారు.

ఈ ఔషధానికి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేసే సామర్థ్యం కూడా ఉందట. ఈ మెడిసిన్‌ కేవలం కరోనా వైరస్‌నేగాక ఇతర అంటువ్యాధులు ప్రబలడానికి కారణమయ్యే వైరస్‌లను కూడా అరికడుతుందట. మరి ఈ మెడిసిన్‌ కావాలంటే మాత్రం ప్రస్తుతానికి హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్లాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version