మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మ‌రోసారి త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

-

బంగారం…. దీనికి ఉన్న డిమాండ్ మ‌రేదానికి ఉండ‌దు. ప్ర‌పంచంలోనే.. అత్యంత విలువైన వ‌స్తువు బంగారం. ప్ర‌పంచంలోని అన్ని దేశాల కంటే.. మ‌న ఇండియాలోనే.. బంగారానికి బాగా డిమాండ్ ఉంటుంది. మ‌న దేశ మ‌హిళ‌లు బంగారం కొన‌డానికి.. బాగా ఇష్ట ప‌డ‌తారు. బంగారం రేటు.. ఎంత ఉన్న‌ది.. అనే విష‌యం ప‌క్క‌కు పెట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అయితే.. తాజాగా బంగారం ధ‌ర‌లు అమాంతం ప‌డి పోయాయి. హైద‌రాబాద్ లో బంగారం ధ‌ర‌లను ఒక‌సారి చూద్దాం.

హై దరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గొల్డ్ పై రూ. 150 వ‌ర‌కు త‌గ్గి.. రూ. 44, 450 కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 160 వ‌ర‌కు త‌గ్గి… 48, 490 కి చేరుకుంది. బంగారం ధరలు త‌గ్గ‌గా… వెండి ధరలు మాత్రం కాస్త పెరిగి పోయాయి. కిలో వెండి ధర ఏకంగా… రూ. 300 పెరిగి పోయి.. 65, 300 లకు చేరుకుంది. బంగారం మరో రెండు రోజుల్లో ఇంకా భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ నిపుణులు చెబుతున్నారు. శుభకార్యాలు లేని నేపథ్యంలోనే… బంగారం ధరలు తగ్గుతున్నాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version