బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త..భారీగా తగ్గిన ధరలు

-

ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. బంగారం భారీగా పెరుగుతోంది.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 360 తగ్గి రూ. 50, 620 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గి రూ. 46,400 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గి పోయాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 600 తగ్గి .. రూ. 61,800 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version