Gold-Silver Price: శుభ‌వార్త‌.. స్థిరంగానే పసిడి, వెండి ధరలు..

-

Gold-Silver Price: ప్ర‌పంచ‌వ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ ను ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల్సినవ‌సరం లేదు. మ‌న దేశంలో అయితే.. మ‌రీ ఎక్కువ‌. ఏ చిన్న సందర్భం దొరికినా బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తిని చూపుతారు. వివిధ రూపాయల్లో బంగారంపై పెట్టుబడి పెట్టాల‌ని భావిస్తారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఓ శుభ‌వార్త‌. గ‌త వారంలో ఆకాశాన్ని తాకినా బంగారం ధ‌ర‌లు.. గ‌త రెండు రోజులగా నేలచూపులు చూస్తున్నాయి.

తాజాగా సోమవారం మాత్రం దేశీయంగా పరిశీలిస్తే ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ, వివిధ ప్రధాన నగరాల్లో మాత్రం హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ క్ర‌మంలో వెండి కూడా ప‌సిడి బాట‌లోనే న‌డుస్తుంది. ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులేకుండా సిర్థంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.59,900లు గా ఉంది

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 లుగా ప‌లుకుతుంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,240 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,240 లుగా ప‌లుకుతుంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 లుగా ప‌లుకుతుంది. .

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 లుగా ప‌లుకుతుంది. .

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 లుగా ప‌లుకుతుంది.

అయితే.. బంగారం ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపే అంశాలు అనేకం. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, ఫెడ్ రిజర్వ్ ప్రకటన, ప్ర‌పంచ‌వ్యాపంగా కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం వంటి అంశాలు బంగారం పైన ప్రభావం చూపాయి. బంగారం ధరలు వచ్చే వారం కూడా పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version