మనతో అప్పటివరకూ బాగానే మాట్లాతారు.. ఉన్నట్టుండి సడన్ గా గుండె పట్టుకుని కిందపడిపోతారు. కంగారుగా ఏదే చేసి.. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఇప్పుడు చాలా మంది విషయంలో జరుగుతుంది. ఆపదలో ఉన్నప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు మధ్యలో ఉన్న ఎమర్జెన్సీ టైంనే గోల్డెన్ అవర్ అంటారు. ప్రైమరీ ట్రీట్‌మెంట్ తర్వాత గంటలోపు హాస్పిటల్‌కి తీసుకొస్తే ప్రాణాలు నిలపొచ్చనేది దీని అర్ధం.
కానీ, ఇప్పుడు ఈ గోల్డెన్ అవర్ ఫార్ములా వర్కవుట్ కావడం లేదేమోనన్న అనుమానం వస్తోంది..! ఎందుకంటే, ఆపదలో పడ్డామని గుర్తించేలోపే ప్రాణాలు పోతున్నాయుగా.. ఆమధ్య పునీత్ రాజ్‌కుమార్, మొన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఇప్పుడు క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
పోస్ట్ కోవిడ్ ఎఫెక్టో, లేక మరేదైనా కారణమో తెలియదు గాని, నిమిషాల వ్యవధిలో ప్రాణాలు పోతున్నాయి. షేన్ వార్న్ విషయంలో అది మరోసారి రుజువైంది. హార్ట్ ఎటాక్‌కి గురైన షేన్ వార్న్‌ను బతికించుకునేందుకు ముగ్గురు స్నేహితులు తీవ్రంగా ప్రయత్నించారు. గుండెను రీయాక్టివేట్ చేసేందుకు CPR చేశారు. ఛాతిపై అదుముతూ నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేశారు. 20 నిమిషాలపాటు విశ్వప్రయత్నాలు చేసినా షేన్ వార్న్‌ను అతని స్నేహితులు బతికించలేకపోయారు.
కొద్దిరోజులుగా ముగ్గురు స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్‌లోనే ఉంటున్న వార్న్… స్నేహితులు వచ్చేసరికి అచేతనంగా పడి ఉన్నాడు. హార్ట్ ఎటాక్‌గా భావించి వెంటనే CPR చేశారు. కానీ, ప్రాణాలు కాపాడలేకపోయామని అతని స్నేహితులు తెలిపారు.
ఏది ఏమైనా.. చావు ఏక్షణంలో అయినా రావొచ్చు అనే మాదిరిగా తయారైంది మన జీవనం. ఇంతకముందు గుండెనొప్పి అంటే..వృద్ధులకే పరిమితం అనుకునే వాళ్లం.. కానీ ఇప్పుడు కాలేజీకి వెళ్లే వారికి సైతం హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం.. సరైన జీవనశైలి లేకపోవడం అయితే.. స్ట్రస్ ఎక్కువైపోవడం. వీలైనంత వరకూ.. మంచి పోషకాహాం తీసుకుంటూ.. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యం.
-Triveni Buskarowthu