గోంగూర వల్ల కలిగే లాభాలు అనేకం..!

-

గోంగూరని మన తెలుగు వాళ్ళు ఎన్నో విధాలుగా ఉపయోగిస్తాం. ఇక గోంగూర పచ్చడి నచ్చని వాళ్ళు ఉండరు. కేవలం రుచి మాత్రమే కాదండి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంక ఆలస్యం ఎందుకు గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే చూసేయండి. గోంగూర లో ఎన్నో పోషక విలువలున్నాయి. దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తుంది ఇది. అధిక బరువు తో బాధ పడే వారికి ఇది బాగా సహాయ పడుతుంది.

గోంగూర లో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రక్త ప్రసరణ సరిగా జరుగుతూ రక్త పోటుని తగ్గిస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ గోంగూరని వాడటం వలన షుగర్ లెవెల్స్ అదుపు లో ఉంటాయి. అంతే కాదండి విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్న గోంగూరను తరచుగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. గోంగూర లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.

దీని కారణంగా శరీరం లో జీర్ణశక్తి పెరిగి, డైజెస్టివ్ సమస్యలు దూరమవుతాయి. ఇది ఇలా ఉండగా దగ్గు, ఆయాసం, తుమ్ముల తో ఇబ్బంది పడే వాళ్లు గోంగూరను తీసుకోవడం వలన అవి తగ్గుతాయి. ఇందులో క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. కనుక మీ డైట్ లో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది. విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉంది. పొటాషియమ్‌, ఫోస్పర్స్, సోడియం కూడా దీనిలో అధికంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version