గుడ్ న్యూస్… ఇక నుంచి మూడు నెలలు బీర్లు ఫ్రీ…!

-

ఒక పక్క కరోనా దెబ్బకు బ్రతికితే చాలు రా దేవుడా అని ప్రపంచం మొత్తం అనుకుంటుంటే ఒక బీర్ల కంపెనీ తాగుబోతులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాగినన్ని బీర్లు ఫ్రీ గా ఇస్తామని ప్రకటించింది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కరోనా వైరస్ దెబ్బకు మద్యం దుకాణాలను మూసి వేసారు. బార్లు, రెస్టారెంట్ లు అనేవి ఏ ఒక్కటి తెరిచి లేవు. దీనితో ఇప్పుడు చుక్క దొరికితే చాలు అనుకునే పరిస్థితి ఉంది.

ఈ తరుణంలో అమెరికాకు చెందిన బుష్ బీర్ కంపెనీ ఒక ఆఫర్ ఇచ్చింది. అమెరికాలోని మిన్నెసోటాలో మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ బుష్ బీర్ తో ఒక ఒప్పందం చేసుకుంది. అమెరికాలో కరోనా క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రజలను జంతువుల వద్దకు రానీయడం లేదు. మనుషుల నుంచి కరోనా జంతువులకు వస్తుంది అనే భయంతో. ఈ తరుణంలో మిడ్ వెస్ట్ సంస్థ దాదాపు 500 కుక్కలను దత్తత ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇందుకు జనాలను ప్రోత్సహించాలి అంటే కాస్త వినూత్నంగా ఆలోచన చేసింది సంస్థ. బుష్ బీర్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకొని కుక్కను దత్తత తీసుకునే వారికి మూడు నెలలకు సరిపడ బీర్‌ను బుష్ బీర్ కంపెనీ ఉచితంగా సరఫరా చేస్తుంది. కుక్కను దత్తత తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు అందరూ కూడా ఒక ఫోటో కుక్కతో దిగి బుష్ బీర్ కంపెనీ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలకు పంపించాలి. ముందు పంపే వారికి 100 డాలర్ల(రూ.7500) రివార్డ్ కూడా ఇస్తుంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version