ఏపీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అతి ప్రధానమైనదని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అహర్నిశలు కృషి చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పంటలకు మద్దతు ధర ప్రకటించింది. మద్దతు ధర ప్రకటింపుతో ఆంధ్రప్రదేశ్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పంట క్వింటాల్ కు మద్దతు ధర ధాన్యం (ఏ-గ్రేడ్) 1,888, మిర్చి 7,000, పసుపు 6,850, కంది 6,000, పెసర 7,196, ఉల్లి 770,మొక్కజొన్న 1,850,సజ్జలు 2,150, జొన్నలు 2,640,కొబ్బరిబాల్ 10,300,కొబ్బరి మర 9,960,బత్తాయి 1,400,శనగలు 5,1,00,అరటి 800,సోయాబీన్ 3,880,మినుములు 6,000,వేరుశనగ 5,275,పొద్దుతిరుగుడు 5,885,చిరు ధాన్యాలు 2,500,జొన్నలు (హైబ్రిడ్) 2,620,రాగులు 3,295,అరటి 800 గా ప్రభుత్వం నిర్ణయించింది.