కానిస్టేబుల్‌ ఉద్యోగాల అభ్యర్థులకు శుభవార్త..వయోపరిమితి 5 ఏళ్లు పెంపు !

-

తెలంగాణలో ఇటీవల కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితిని మొత్తంగా ఐదు సంవత్సరాలకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే “askకేటీఆర్” కార్యక్రమంలో ఓ నిరుద్యోగి ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్ళాడు. కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలు వృధా అయ్యాయి అని… తాజా నోటిఫికేషన్ లో ఇచ్చిన మూడు సంవత్సరాల సడలింపు ను మరో రెండు సంవత్సరాలు అదనంగా పెంచాలని ఆ నిరుద్యోగి మంత్రి కేటీఆర్ ను కోరాడు. అయితే దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్… రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ నీ.. ఈ అంశాన్ని పరిశీలించాలని కోరతానని.. ఆయన రిప్లై ఇచ్చాడు. ఇక మంత్రి కేటీఆర్ చెప్తే హోం శాఖ కచ్చితంగా వింటుందని… నిరుద్యోగులు భరోసాతో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version