నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మరో నోటిఫికేషన్…

-

గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో ఖాలిగా ఉన్న 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్ లు విడుదల చేస్తోంది. ఇటీవల పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ తెలంగాణ సర్కార్.. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.. ఇప్పటికే గ్రూప్‌-1 నోటి‌ఫి‌కే‌షన్‌ జారీ చేసిన టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ (TSPSC) మరి‌కొన్ని నోటి‌ఫి‌కే‌షన్లు విడు‌దల చేసేందుకు సన్నా‌హాలు చేస్తు‌న్నది.

త్వర‌లోనే 149 అసి‌స్టెంట్‌ మోటర్‌ వెహి‌కిల్‌ ఇన్‌‌స్పె‌క్టర్‌ (AMVI) పోస్టుల భర్తీకి నోటి‌ఫి‌కే‌షన్‌ ఇవ్వను‌న్నట్టు సమా‌చారం. ఈ పోస్టుల భర్తీకి సంబం‌ధిం‌చిన ఇండెంట్‌ టీఎ‌స్‌‌పీ‌ఎ‌స్సీకి చేరింది. బీటెక్‌ ఆటో‌మొ‌బైల్‌, మెకా‌ని‌కల్‌ ఇంజి‌నీ‌రింగ్‌ కోర్సులు పూర్తిచేసి‌న‌వారు ఏఎంవీఐ పోస్టులకు అర్హులు. అయితే పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version