క్రెడిట్‌కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. పైసల్‌ వాపస్‌

-

క్రెడిట్ కార్డు వినియోగించే వారు సదరు బ్యాంకు ఇచ్చే గడువు లోపు బిల్లు చెల్లింపులు చేస్తుంటారు. ఓసారి బిల్లు జనరేట్ అయిన తర్వాత కస్టమర్ కు బిల్లు పూర్తి మొత్తం లేదా కనీస మొత్తం చెల్లించేందుకు బ్యాంకులు అవకాశం ఇస్తాయి. మొత్తం బిల్లు చెల్లిస్తే సరి, లేకుంటే కనీస మొత్తం కూడా చెల్లించవచ్చు. అయితే ఇలా కనీస మొత్తం చెల్లించినప్పుడు మిగతా మొత్తాన్ని వడ్డీతో కలిసి వచ్చే నెల బిల్లులు వడ్డిస్తాయి. ఇందులో మరో అవకాశం కూడా కస్టమర్లు వాడుకుంటుంటారు.

క్రెడిట్ కార్డు బిల్లులో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ కూడా చెల్లిస్తుంటారు. ఇలా చెల్లించడం ద్వారా ఓ లాభం ఉందని వారు భావిస్తుంటారు. వచ్చే నెలలో తమకు ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు లేదా ఖర్చు చేయాలనుకున్నప్పుడు సదరు కార్డులో ఎక్కువ మొత్తం అందుబాటులో ఉంటే దాని ద్వారా ఖర్చుపెట్టేయవచ్చని అనుకుంటుంటారు. దీంతో బిల్లులో ఇచ్చిన పూర్తి మొత్తం కంటే ఎక్కువ మొత్తాలు చెల్లించేస్తున్నట్లు బ్యాంకులు తాజాగా గుర్తించాయి. అలాగే దీంతో మోసాలు కూడా జరుగుతున్నట్లు తేలింది.

దీంతో మనీలాండరింగ్, మోసాలు జరుగుతున్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. వివిధ అకౌంట్లలో దొంగలించిన డబ్బును క్రెడిట్ కార్డులకు పంపిస్తూ, తద్వారా విదేశీ లావాదేవీలకు వాడుతున్నారు. దీంతో అప్రమత్తమైన బ్యాంకులు మోసాల కట్టడికి ఈ నిర్ణయానికి వచ్చాయి. ఈ మోసాల పట్ల ముందే అప్రమత్తమైన కొన్ని బ్యాంకులు క్రెడిట్ బిల్లు కంటే ఎక్కువగా చెల్లింపులు చేయకుండా కట్టడి చేయడానికి కొత్త నిబంధనలు తెచ్చాయి. హెచ్డిఎఫ్సి, సిబిఐ వంటి బ్యాంకులు వారి యాప్‌ల ద్వారా అధికంగా క్రెడిట్ బిల్లు చెల్లింపులు చేయకుండా నిరోధిస్తున్నాయి. ఇదే బాటలో మరిన్ని బ్యాంకులు కూడా కొత్త నిబంధనలు అమలు చేయాలని చూస్తున్నాయి. కాబట్టి ఇకమీదట క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల సమయంలో అధికంగా కాకుండా బిల్లుకు సరిపడా చెల్లింపులు చేస్తే చాలు అని బ్యాంకులు పేర్కొంటున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version