సీఎం రేవంత్‌ కోసం మంత్రి కొండా సురేఖ భారీ ఏర్పాట్లు

-

సీఎం రేవంత్ వరంగల్ పర్యటన సందర్భంగా జిల్లా నుంచి మంత్రిగా వ్యవహరిస్తున్న కొండా సురేశ్ జిల్లా వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా నగరం నలువైలులా బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. నగరం మొత్తం కాంగ్రెస్ జెండలు, కటౌట్లతో నిండిపోయింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవ సభకు విచ్చేస్తున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ ఎనుముల గారికి స్వాగతం సుస్వాగతం..అంటూ పెద్ద ఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేయించారు. కాగా, ఈ బ్యానర్ల ఏర్పాటుతో పలుచోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version