ఆరేళ్ల కింద తప్పిపోయిన తండ్రి.. ఒక్కసారిగా కనిపించడంతో కూతుర్లు ఏం చేశారంటే?

-

కుటుంబసభ్యులకు ఏదైనా జరిగిందంటే ఇంట్లోని వారు ఎవరూ ప్రశాతంగా ఉండలేరు.వారి జ్జాపకాలను గుర్తుచేసుకుంటూ అనుక్షణం బాధపడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఆరేళ్ల కిందట తప్పిపోయిన తమ కన్నతండ్రిని చూసిన ఇద్దరు కూతుర్లు ఒక్కసారిగా బాగోద్వేగానికి గురయ్యారు. వివరాల్లోకివెళితే.. ఆరేళ్ల కిందట మతిస్థిమితం కోల్పోయిన బాలయ్య అనే వ్యక్తి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ‘ఆశ్రయం’కల్పించారు నిర్వాహకులు.

గత నెల రోజుల క్రితం బాలయ్య కూతురు దివ్య మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదానం నిర్వహించేందుకు వచ్చింది. ఆ సమయంలో తమ కన్నతండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడని నిర్వాహకులకు చెప్పింది. మంగళవారం మరోసారి బాలయ్య కూతుర్లు ఆశ్రమంలో అన్నదానం జరిపించడానికి రాగా.. అందులోని 130 మందిలో తమ కన్నతండ్రిని గుర్తుపట్టిన కూతుర్లు ఒక్కసారిగా బావోద్వేగానికి గురయ్యారు. కన్నతండ్రిని హత్తుకుని బోరున విలపించారు.ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version