ప్రస్తుతం సైన్స్ వేగంగా అభివృద్ధి చెందింది.. దాంతో టెక్నాలజీ కూడా పెరిగింది.బ్యాంకింగ్ నుంచి ఇతర అనేక రంగాలకు సంభందించిన సేవలను ఆన్లైన్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడంతో ఇంట్లోనే ఉండి మొబైల్లో సులభంగా సేవలను పొందే విధంగా సదుపాయాలు అందుబాటులోకి వస్తు్న్నాయి. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియాపెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ తో కలిసి శుక్రవారం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.
అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఎన్పీఎస్ అకౌంట్ ఓపెన్ చేసి వెబ్‌పేజీలోకి వెళ్లవచ్చు. అలాగే ఫోటో, ఇతర వివరాలను డిజిలాకర్ నుంచి పొందడం కోసం ఆధార్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేసే ప్రక్రియ సులభంగానూ, వేగవంతంగానూ, కాగితరహితమైనదని తెలిపింది.ఈ స్కీమ్ కింద వినియోగదారులకు వారి భవిష్యత్తును మెరుగు పర్చడానికి, సురక్షితంగా ఉంచడానికి మరెన్నో బెనిఫిట్స్ ను అందిస్తుంది.