పవన్ కల్యాణ్‌తో అంతటి అనుబంధం..వేణు మాధవ్ భార్య వ్యాఖ్యలివే..

-

టాలీవుడ్ దివంగత స్టార్ కమెడియన్ వేణు మాధవ్..అతి చిన్న వయసులోనే అందరినీ వదిలి వెళ్లిపోయారు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా స్టేజీ షోలు చేసిన వేణు మాధవ్..సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ కమెడియన్ అయిపోయారు. స్టార్ హీరోల పక్కన నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

అనారోగ్యం బారిన పడి అతి చిన్న వయసులో కన్నుమూసిన వేణు మాధవ్..చిత్ర పరిశ్రమకు తనదైన సేవలందించారు. వేణు మాధవ్ భార్య తన ఇద్దరు కొడుకులతో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో వేణు మాధవ్ సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేణు మాధవ్ తో మెగా ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని గురించి వివరించింది.

అప్పట్లో వేణు మాధవ్ పది ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారని, అందులో పండే బియ్యంలో కొన్ని బస్తాల బియ్యం ప్రతీ సంవత్సరం ఆయన..పవన్ కల్యాణ్ కు పంపిస్తారని తెలిపింది. ఈ క్రమంలోనే పవన్ ..తమకు మామిడి కాయలు పంపిస్తారని, అలా ఇరువురికి ఒకరిపై మరొకరికి ఇష్టం ఉందని చెప్పింది. అది ఓ ఒప్పందం కాగా ఇప్పటికీ అది కొనసాగుతున్నదని పేర్కొంది.

Pawan Kalyan gives clarity on his movies

వేణు మాధవ్ లేకున్నా బియ్యం పంపుతున్నామని, వారు మామిడికాయలు పంపుతున్నారని స్పష్టం చేసింది వేణు మాధవ్ భార్య. నాగబాబు, పవన్ కల్యాణ్ తమతో ఫోన్ లో మాట్లాడుతారని పేర్కొంది. ఇక వేణు మాధవ్ కు ఇద్దరు కుమారులు కాగా అందులో ఒకరు డైరెక్టర్ కావాలని అనుకుంటుండగా, మరొకరు మంచి నటుడు కావాలని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version