ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపు..!

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ని చెప్పింది. 2023 జులై డియర్‌నెస్ అలవెన్స్ కోసం ఉద్యోగులు చూస్తున్నారు. దసరా, దీపావళి పండుగ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచుతున్నట్టు చెప్పింది. అయితే ఇక ఇప్పుడు అంతకన్నా ముందే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి సెప్టెంబర్‌ నెలలోనే డీఏ పెంచనున్నారు. సెప్టెంబర్‌లో డీఏ పెంచినా 2023 జులై నుండి అది వర్తిస్తుంది. రెండు నెలల డీఏ బకాయిలు కూడా కేంద్రం చెల్లిస్తుంది.

ఇది ఇలా ఉండగా ప్రతీసారి 3 నుంచి 4 శాతం మేర డీఏ పెంచుతుంది. మరి ఇక ఇప్పుడు చూస్తే… ఈసారి 3 శాతం డీఏ పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇలా కనుక పెరిగింది అంటే డీఏ 45 శాతానికి చేరుకుంటుంది. ప్రతీ ఏటా రెండు సార్లు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ ని కేంద్రం పెంచుతుంది.

ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడు పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ కూడా పెరుగుతుంది. ఈసారి కూడా డీఏ 4 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత డియర్‌నెస్ అలవెన్స్ పెరుగుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలు ఇవ్వాల్సి వుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version