ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును పెంచింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో 8.10 వడ్డీ ని ఈపీఎఫ్ఓ ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. 5 కోట్లకు పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 8.15 శాతం అంటే 5 బేసిస్ పాయింట్స్ ని ఈసారి పెంచింది.

గత రెండు రోజులుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఈపీఎఫ్ వడ్డీరేటుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ విషయం గురించి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి అతి తక్కువగా 8.1 శాతం వడ్డీ ని ఇచ్చిన విషయం తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఇంకా తక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు.

వడ్డీ రేటు దాదాపు 8 శాతానికి తగ్గిస్తారని అనుకున్నారు. కానీ 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచారు. ఈపీఎఫ్ఓ వడ్డీ ని కనుక తగ్గిస్తే ఈపీఎఫ్ ఖాతాదారులకు కంట్రిబ్యూషన్‌ పై వచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తర్వాతే ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ పడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version