పీఎఫ్ తో ఎన్నో లాభాలని పొందొచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కి అర్హులు. చాలా మందికి ఈడీఎల్ఐ స్కీమ్ గురించి తెలీదు. దీని కోసం ఇప్పుడే చూద్దాం.
అసలు ఈడీఎల్ఐ స్కీమ్ అంటే ఏమిటి…?
ఇక దీని గురించి చూస్తే..ఇది ఈపీఎఫ్ఓ అందించే బీమా ప్రయోజనం.
ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ లో కొన్ని మార్పులు చేసింది ఈపీఎఫ్ఓ.
అయితే పీఎఫ్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ లాభాలు పొందాలనే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.
ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో 12 నెలల కాలంలో పని చేసి మరణిస్తే కుటుంబ సభ్యులకు కూడా బీమా ప్రయోజనం కల్పించాలని దీన్ని తీసుకు వచ్చారు.
రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉచితంగా బీమా ని పొందొచ్చు.
ఒకవేళ కనుక సర్వీసులో ఉండగా మరణిస్తే నామినీకి బీమా మొత్తం వస్తుంది.
బేసిక్ సాలరీ రూ.15,000 లోపు ఉంటే ఇది వర్తిస్తుంది.
బేసిక్ సాలరీ రూ.15,000 దాటితే గరిష్టంగా రూ.7 లక్షల వరకు బీమా ఉంటుంది.
ఈ స్కీమ్ లో చేరేందుకు డబ్బులని పే చెయ్యక్కర్లేదు.
బేసిక్ సాలరీలో 0.5% లేదా గరిష్టంగా రూ.75 ని నెలా నెలా కడుతూ ఉండాలి.
ఒకవేళ చనిపోతే చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్, ఫామ్ 5 ఐఎఫ్, నామినీ అకౌంట్‌కు చెందిన క్యాన్సల్డ్ చెక్ ని సబ్మిట్ చేయాల్సి వుంది.