రైతులకి శుభవార్త… ఆ గడువు పొడిగింపు..!

-

అన్నదాతలకు గుడ్ న్యూస్. కేంద్రం తాజాగా ఓ నిర్ణయం తీసుకుని రైతులకి గుడ్ న్యూస్ ని చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులు ఈ-కేవైసీని తప్పనిసరిగా సమర్పించే తుది గడువును మార్చి 31, 2022 నుంచి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులు ఈ-కేవైసీని తప్పనిసరిగా సమర్పించే తుది గడువును మార్చి 31, 2022 నుంచి మే 31, 2022 వరకు ఎక్స్టెండ్ చేసింది. ఇది ఇలా ఉంటే ఓటీపీ ధ్రువీకరణ ద్వారా చేపట్టే ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది.

అయితే రైతులు సీఎస్‌సీ కేంద్రాలకు వెళ్లి కచ్చితంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకోవాలని అంది. అయితే పీఎం కిసాన్ నమోదిత రైతులకు కచ్చితంగా ఈ-కేవైసీ ఉండాలి. అయితే మే 31, 2022 లోపల ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం రైతులకి చెప్పింది. దీని కోసం పూర్తి వివరాలని మీరు https://pmkisan.gov.in/ లో చూసుకోచ్చు.

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆధార్‌తో ఓటీపీ అథెంటికేషన్ చేపడుతూ రైతులు ఈ ప్రక్రియని పూర్తి చెయ్యడం అవ్వదు. రైతులు తమ ఆధార్ కార్డు తీసుకుని సీఎస్‌సీ సెంటర్ కి వెళ్లి చేయించుకోవాలి. ఇది ఇలా ఉంటే 11వ వాయిదాను పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీని పూర్తి చేయాలి. లేదంటే ఆ డబ్బులు రానట్టే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version