కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త..పెరిగిన కొత్త ఎఫ్‌డీ రేట్లు ఇవే..!!

-

కొత్త నెల మొదలు అయ్యింది అంటే వడ్డీ కూడా మారతాయి..ఆర్బీఐ మూడోసారి రెపో రేటు ను పెంచడంతో దాని ప్రభావం బ్యాంకు డిపాజిట్స్, లోన్స్‌పై చూపనుంది..దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. 2 నుంచి 5 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లలో బ్యాంక్ భారీ మార్పులు చేసింది. రెపో రేటు పెరిగిన నేపథ్యంలో బ్యాంకు ఎఫ్‌డీ రేట్లను పెంచింది. పెంచిన రేట్లు ఆగస్టు 8, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి..

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రెపో రేటును పెంచింది. గత నాలుగు నెలల్లో ఆర్బీఐ రెపో రేటును మొత్తం మూడు సార్లు పెంచింది. మొదటి రెండు సార్లు మొత్తం 90 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఈసారి 50 బేసిస్ పాయింట్లను పెంచింది. దాంతో ప్రస్తుతం రెపో రేటు 5.40 శాతంగా ఉంది..

ఇప్పుడు అన్ని బ్యాంకులు, ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు, ఆర్‌డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ 7 రోజుల నుంచి 5 సంవత్సరాల ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 2 నుంచి 5 కోట్ల రూపాయలకు 3.25 శాతం నుంచి 5.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది..ఇప్పుడు వాటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..

2 నుంచి 5 కోట్ల వరకు FD కొత్త రేట్లు..

7 నుండి 14 రోజులు – 3.25%
15 నుండి 29 రోజులు – 3.25%
30 నుండి 45 రోజులు – 3.35%
46 నుండి 60 రోజులు – 3.65%
61 నుండి 90 రోజులు – 4.50%
91 నుండి 120 రోజులు – 5.00%
121 నుండి 150 రోజులు – 5.00%
151 నుండి 184 రోజులు – 4.75%
185 నుండి 210 రోజులు – 5.25%
211 నుండి 270 రోజులు – 5.25%
271 నుండి 289 రోజులు – 5.50%
290 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ – 5.50%
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు – 5.75%
2 నుండి 3 సంవత్సరాలు – 5.75%
3 నుండి 5 సంవత్సరాలు – 5.75%
5 నుండి 10 సంవత్సరాలు – 5.75%

2 కోట్ల కంటే తక్కువ ఉన్నవి..

7 నుండి 14 రోజులు – 2.75%
15 నుండి 29 రోజులు – 2.75%
30 నుండి 45 రోజులు – 3.25%
46 నుండి 60 రోజులు – 3.25%
61 నుండి 90 రోజులు – 3.25%
91 నుండి 120 రోజులు – 3.75%
121 నుండి 150 రోజులు – 3.75%
151 నుండి 184 రోజులు – 3.75%
185 రోజుల నుండి 210 రోజులు – 4.65%
211 రోజుల నుండి 270 రోజులు – 4.65%
271 రోజుల నుండి 289 రోజులు – 4.65%
290 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ – 4.65%
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు – 5.30%
2 నుండి 3 సంవత్సరాలు – 5.35%
3 నుండి 5 సంవత్సరాలు – 5.70%
5 నుండి 10 సంవత్సరాల వరకు FD లపై – 5.75%
పైన తెలిపినవి అన్నీ తాజాగా అమల్లోకి వచ్చిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు..సెప్టెంబర్‌లో మరి కాస్త పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version