తిరుమల తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై సీఎం చంద్రబాబు సహా అందరూ తీవ్ర స్తాయిలో స్పందించారు. ఈ నేపథ్యంలో తిరుపతి తొక్కిసలాట ఘటన పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ.. అనుకోని ప్రమాదం జరిగిపోయింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
తొక్కిసలాట ఘటన పై బాధితులకు పరిహారం అందించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు బాధిత కుటుంబాలకు బోర్డు సభ్యులు స్వయంగా పరామర్శించాలని నిర్ణయించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం అందివ్వనున్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి రూ.5లక్సల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. స్వల్పంగా గాయపడిన వారికి రూ.2లక్షల సాయం అందజేయనున్నారు.