వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరి వెల్లండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలపై సుంకాలు భారీగా విధించిన విషయం తెలిసిందే. దీంతో ముడి చమురు ధరలు దిగొచ్చాయి.
అమెరికా అత్యధికంగా ముడిచమురును దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు దిగుమతి సుంకం పెంచడంతో ఆ దేశం చమురు దిగుమతిని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లోనూ క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయాయి. మార్కెట్ పెంచుకోవడానికి చమురు కంపెనీలు ధరలను తగ్గించే స్థితిలో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి వెల్లడించారు. భారత్ 40 దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, ప్రస్తుత ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటే ఓఎంసీలు ఇంధన ధరలను తగ్గించే సామర్థ్యంతో ఉంటాయని.. ఫలితంగా ధరలు తగ్గే చాన్స్ ఉందన్నారు.