ఉల్లి రైతులకు గుడ్ న్యూస్.. ఆ నిషేదం ఎత్తివేత..!

-

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ.. ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఉల్లి ఎగుమతులపై నిషేదం విధించింది కేంద్రం. తాజాగా ఆ నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు.. ఉల్లి ఎగుమతి ధరను టన్నుకు రూ.45,860 గా నిర్దారించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు లాభం చేకూరనుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ఎక్సేంజ్ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్ లో ఉల్లి ఎగుమతి ధర రూ.500 డాలర్లుగా నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వం ఉల్లిని పూర్తిగా నిషేదిత జాబితాలోకి చేర్చినప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ వంటి దేశాల అభ్యర్థన మేరకు పరిమిత ఎగుమతులకు అనుమతించింది. అనంతరం ఉల్లి పై నిషేదాన్ని పూర్తిగా ఎత్తివేయాలని ఉల్లి వ్యాపారులు, రైతులు ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన ఉల్లి రైతులు పలుమార్లు డిమాండ్ చేసినా దేశంలో ధరలు పెరుగుతాయనే కారణంతో కేంద్రం వారిపై కనికరం చూపలేదు. లోక్ సభ ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉల్లి వ్యాపారులే కాక రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version