రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ లో ఉన్న ప్రయాణికులు.. తమ సొంతూళ్లకు బయలు దేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే, సంక్రాంతి పండుగ కోసం ఊళ్ళకు వెళ్లే ప్రయాణికులకు టిఎస్ఆర్టిసి శుభవార్త చెప్పింది.
ప్రయాణికులు రానుపోను టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే రిటర్న్ జర్నీ టికెట్ పై 10 శాతం రాయితీని అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు ఉంటుందని పేర్కొంది. పండుగ నేపథ్యంలో ఈ నెల 14 వరకు 4,233 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టిఎస్ఆర్టిసి తెలిపింది. JBS, MGBS, LBనగర్, ఉప్పల్, అరంగేడ్ నుండి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.