పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్ న్యూస్..త్వరలోనే పెరగనున్న వడ్డీ రేట్లు..

-

పోస్టాఫీసు ఎన్నో పథకాలును అమలు చేస్తుంది.. ఇప్పటికే ఎన్నో పథకాలను జనాలకు మంచి బెనిఫిట్ ను అందిస్తున్నాయి.అందులో సేవింగ్ చేసే వారికి వివిధ రకాలు వడ్డీ రేట్లు ఉన్నాయి. కరోనా సమయంలో వీటిపై సేవింగ్స్ తగ్గినా.. కోవిడ్ తర్వాత పుంజుకుంది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే కూడా.. ఈ పోస్టీఫీసుల్లో ఇచ్చే వడ్డీ ఎక్కువగా ఉంటుందని.. వీటిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. పోస్టాఫీసుల్లో అత్యధికంగా వడ్డీ ఇచ్చే పథకాల గురించి తెలుసుకుందాం..

జూలై 1 నుంచి పోస్టాఫీసుల్లోని డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని పొందవచ్చు. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై జూన్ 30న నిర్ణయం తీసుకోనున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న రెపో రేటు మరియు పెరుగుతున్న రుణ రేటు కారణంగా, చిన్న పొదుపు పథకం వడ్డీ కూడా బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు..

ఆర్‌బీఐ రెపో రేటు పెంచినప్పటి నుంచి బ్యాంకులు రుణాలను మరింతగా పెంచుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ కూడా పెరిగింది. PPF, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర, NSC వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉంటుంది..చిన్న పొదుపు పథకంపై వడ్డీ రేటును పెంచవచ్చు. డిపాజిట్లపై, ముఖ్యంగా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ గత కొంతకాలంగా స్థిరంగా ఉన్నాయి.

ఈ స్కీంలో ప్రస్తుం 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటును వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు. దీనిలో కనీసం నెలకు రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. కానీ ఈ ఖాతాను 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీదనే అకౌంట్ ను తెరవాలి..21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ తీరుతుంది. అయితే దీనిలో ఉన్నత విద్య కోసం ఖాతాదారు ఆర్థిక అవసరాలను తీర్చడానికి, గత ఆర్థిక సంవత్సరం చివరిలో ఖాతా క్రెడిట్‌లో ఉన్న బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించబడుతుంది..

జాతీయ పొదుపు రికరింగ్ డిపాజిట్ ఖాతా 5.8%, జాతీయ పొదుపు నెలవారీ ఆదాయ ఖాతా 6.6%, కిసాన్ వికాస్ పత్ర 6.9%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఫండ్ 7.1%, జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం 6.8% , సుకన్య సమృద్ధి పథకం కింద 7.6%, సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కింద 7.4% గా ఉన్నాయి..ఇప్పుడు ఈ వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version