ఓకే జట్టులో కోహ్లీ, పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్?: సూపర్ సిరీస్ కు రంగం సిద్ధం

-

ఆధునిక క్రికెట్ లో మేటి బ్యాటర్లైన విరాట్ కోహ్లీ,పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ కలిసి ఓకే జట్టులో ఆడితే ఎలా ఉంటుంది..? ఆ ఊహే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది. టీమిండియా సారథి రోహిత్ శర్మ, బాబర్ అజామ్ తో కలిసి బ్యాటింగ్ చేస్తే? ప్రత్యర్థి జట్టుకి చుక్కలే.. ఇక జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది కలిసి బౌలింగ్ చేస్తే..? ఆ విధ్వంశం మీ ఊహకే వదిలేస్తున్నాం. అసలు ఇవన్నీ కలలో కూడా జరుగుతాయా.? కలలో ఏమో కానీ వాస్తవంగా కార్యరూపం దాల్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అదెలా? అంటే..

ఈ ప్రశ్నకు సమాధానమే ‘ఆఫ్రో-ఆసియా కప్’. టి-20 ఇతర క్రికెట్ టోర్నీల వల్ల మరుగున పడ్డ ఈ టోర్నీ మళ్ళీ రాబోతుంది. ఈ మేరకు ఆసియా, ఆఫ్రికా ఖండం లోని క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బిసిసిఐ, పిసిబి తో పాటు ఆఫ్రికా ఖండంలోని క్రికెట్ బోర్డుల తో చర్చలు జరుపుతున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసిసి) కమర్షియల్ అండ్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరన్ తన్రాజ్ తెలిపారు. ఆఫ్రొ- ఆసియా కప్ ఎలాగైనా నిర్వహించాలని భావిస్తున్నామన్నారు ప్రభాకరన్. ప్రపంచంలోనే మేటి జట్లుగా ఉన్న ఇండియా, పాకిస్తాన్ తో పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు కలిసి ఆడడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. బోర్డుల నుంచి సమ్మతి కోసం మేము తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version