ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పింది చంద్రబాబు కూటమి సర్కార్. ఇకపై రేషన్ దుకాణాలలో ఉల్లిపాయలు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీలోని చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్. ఇవాళ్టి నుంచే రేషన్ దుకాణాలలో ఉల్లిపాయలు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.14 లకే కిలో ఉల్లిపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీలోని కూటమి సర్కార్.

ఇక ఈ స్కీం నేపథ్యంలో…. కర్నూల్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనుంది సర్కార్. నేటి నుంచి కర్నూల్ జిల్లాలో ఉల్లిపాయలు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీలోని చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్. రేషన్ కార్డు దారులకు ఎన్ని కిలోలు అవసరం ఉన్నా కూడా… రూ.14 లకే అందించనున్నారు. అలాగే.. ఏపీలోని ప్రభుత్వ హస్టళ్లు, అన్నా క్యాంటీన్లకు కూడా రూ.14 లకే కిలో ఉల్లిపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీలోని కూటమి సర్కార్.