తప్పతాగి స్కూలుకు వచ్చి క్లాస్ రూంలో నిద్రపోయిన టీచర్ సస్పెండ్

-

తప్పతాగి స్కూలుకు వచ్చి క్లాస్ రూంలో నిద్రపోయిన టీచర్ సస్పెండ్ అయ్యాడు. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండి, నిబంధనలు ఉల్లంఘించిన SGT జే. విలాస్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపాలు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రమాదేవి. జైనూర్ మండలం సుకుత్ పల్లి AHSలో SGTగా పనిచేస్తున్న విలాస్ మద్యం తాగొచ్చి విధులకు హాజరైనట్లు ఫిర్యాదు చేశారు గ్రామస్థులు.

teacher
Teacher suspended for coming to school drunk and falling asleep in classroom

దీనిపై విచారణ చేపట్టి పీవో ఆదేశాలతో విలాస్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రమాదేవి. కాగా… తప్పతాగి స్కూలుకు వచ్చి క్లాస్ రూంలో నిద్రపోయిన టీచర్ వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news