SBI కస్టమర్లకు గుడ్ న్యూస్..టీవీ, ల్యాప్‌టాప్, ఫోన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్..!

-

కొత్త స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌,టీవీ లు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్..ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ వీటిపై భారీ తగ్గింపును అందిస్తుంది..ఎస్‌బీఐ కార్డు కస్టమర్లకు సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఎంఐ యానివర్సరీ సేల్ జరుగుతోంది. ఈ సేల్ ఈరోజు (జూలై 13) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ప్రొడక్టులను కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 7500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ అనేది మీరు కొనే ప్రొడక్ట్ ప్రాతిపదికన మారుతూ ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తే.. రూ. 4500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రెడ్‌మి, షావోమి ఫోన్లకు ఇది వర్తిస్తుంది. షావోమి 11 లైట్ ఫోన్‌పై రూ. 2 వేల వరకు, షావోమి 11టీ ప్రో ఫోన్లపై 3 వేల వరకు తగ్గింపు ఉంది. షావోమి 12 ప్రో ఫోన్‌పై రూ. 4500 తగ్గింపు లభిస్తుంది. షావోమి 11 ఐ ఫోన్లపై రూ.2500 డిస్కౌంట్ ఉంది. రెడ్‌మి నోట్ 11 ప్రో,11 ప్రో ప్లస్ ఫోన్లపై రూ. 1500 నుంచి రూ. 2 వేల తగ్గింపు పొందొచ్చు. రెడ్‌మి నోట్ 10 ప్రో, రెడ్‌మి నోట్ 11 ఎస్, రెడ్‌మి నోట్ 11టీ, రెడ్‌మి నోట్ 10ఎస్ ఫోన్లపై రూ. 1500 వరకు తగ్గింపు ఉంది. ఇక రెడ్‌మి 10 ప్రైమ్, రెడ్‌మి నోట్ 11, రెడ్‌మి నోట్ 10టీ ఫోన్లపై రూ. 1350 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

ఇక ల్యాప్‌టాప్ ల విషయాన్నికొస్తే..రెడ్‌మి బుక్ 15 ఐ3 ల్యాప్‌టాప్‌పై రూ. 2500 తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. రెడ్‌మి బుక్ ప్రో ఐ5 ల్యాప్‌టాప్‌పై రూ. 3500 డిస్కౌంట్ ఉంది. ఎంఐ ఎన్‌బీ ప్రో ఐ5 ల్యాప్‌టాప్‌పై కూడా ఇదే తగ్గింపు ఉంది. ఎంఐ ఎన్‌బీ అల్ట్రా ఐ5 ల్యాప్‌టాప్‌పై కూడా రూ. 3500 డిస్కౌంట్ ఉంది. అలాగే ఎవరైనా రోబోట్ వాక్యూమ్ క్లీనర్ కొనుగోలు చేస్తే రూ. 1500 తగ్గింపు పొందొచ్చు.

టీవీలు..రెడ్‌మి 32 అంగుళాలు (2కే), 43 అంగుళాలు (2కే) టీవీలపై రూ.2500 తగ్గింపు ఉంది. రెడ్‌మి 50 అంగుళాలు (4కే), 55 అంగుళాలు (4కే), 65 అంగుళాలు (4కే) టీవీలపై రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎంఐ టీవీ క్యూడీ 55 టీవీపై రూ.5 వేలు, ఎంఐ టీవీ క్యూడీ 75 టీవీపై రూ.7500 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. షావోమి ఓఎల్ఈడీ 55 టీవీపై అయితే రూ. 6 వేల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది..మిగితా టీవీ లపై 2 వేల వరకూ భారీ డిస్కౌంట్‌ ను పొందవచ్చు.ఈ ఆఫర్లు ఎంఐ.కామ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రొడక్టును కొనుగోలు చేస్తేనే లభిస్తుంది. ఇంకా ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు ఆఫర్ ఉంటుంది. ఎస్‌బీఐ కార్పొరేట్ కార్డులు, పేటీఎం ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్ లేదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version