రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో గత వైసీపీ
ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని సీఎం చంద్రబాబు ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని.. ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ఇచ్చిన పలు హామీలను త్వరలోనే అమలు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. మే నెల నుంచి ప్రభుత్వ స్కూళ్ల లో విద్యార్థుల భోజనానికి నాణ్యమైన బియ్యం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, హాస్టళ్లకు క్వాలిటీతో కూడిన బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పారు. బియ్యం ఏ విధంగా సరఫరా చేయాలనేది త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు.