విద్యార్థులకు శుభవార్త.. టీసీ లేకున్నా పాఠశాలల్లో అడ్మిషన్!

-

ఈ మధ్య కాలంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పలు స్కూళ్ల యాజమాన్యాలు పూర్తి ఫీజు చెల్లిస్తే మాత్రమే టీసీ (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్) ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బును ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఇలాంటి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలకు చెక్ పెట్టే విధంగా తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను టీసీ లేకుండానే చేర్చుకునే విధంగా ఆదేశాలను జారీ చేసింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలను చెక్ పెట్టినట్టేనని చెబుతున్నారు. తమిళనాడు విద్యాశాఖ టీసీ లేకుండానే చేరే అవకాశం కల్పించడంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

తమిళనాడు విద్యాశాఖ మంత్రి సెంగోట్టయన్‌ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేసే పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే ఫీజులు చెల్లిస్తేనే టీసీ అంటూ యాజమాన్యాలు విద్యార్థులను వేధించడం మొదలుపెట్టాయి. విద్యాశాఖకు వరుసగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకటవ తరవతి నుంచి 8వ తరగతి విద్యార్థులు టీసీ సమర్పించకుండానే ప్రభుత్వ పాఠశాలల్లో చేరవచ్చు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి కొత్తగా 1,72,000 మంది విద్యార్థులు చేరినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version