తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు సుఖ సంతోషాలతో పాడి పంటలతో చల్లగా ఉండాలి అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ రైతులకు ఓ శుభవార్త అందించారు మంత్రు. టన్ను పామాయిల్ గెలల ధర 20,506 రూపాయలుగా స్థిరీకరించబడింది అని ఆయన పేర్కొన్నారు. నూతన సంవత్సర కానుకగా జనవరి మొదటి తారీఖు నుంచి అంటే రేపాయి నుండి పెరిగిన ధరలు అమలు కానున్నాయి.
ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో రుణమాఫీతో రైతు రాజ్యం నడుస్తుంది అని పేర్కొన మంత్రి. రైతు భరోసా, రైతు భీమా, సన్న ధాన్యంకు 500 బోనస్ తో తెలంగాణ రైతాంగంకు మంచి రోజులు వచ్చాయి అన్నారు. అలాగే అత్యధిక ధాన్యం ఉత్పత్తితో యావత్ దేశానికి తెలంగాణ అన్నపూర్ణ గా నిలిచింది అని పేర్కొన మంత్రి తుమ్మల.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు పొలం బాట పట్టేలా తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికే మార్గదర్శిగా మారబోతోంది అని తెలిపారు.