న్యూ ఇయర్ అంటే ప్రతి ఒక్కరు కూడా సరదాగా గడుపుతారు. రాత్రంతా పార్టీలకు వెళుతూ ఉంటారు. న్యూ ఇయర్ హ్యాంగోవర్ నుంచి బయటపడడానికి ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఇలా చేస్తే ఈజీగా హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడటానికి అవుతుంది. ఒక గ్లాస్ ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఏదో ఒక ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి.
అలాగే ఈ సమస్య నుంచి బయటపడడానికి కూడా కొన్ని మీకు హెల్ప్ చేస్తాయి. హ్యాంగ్ ఓవర్ సమస్య ఉన్నట్లయితే కచ్చితంగా వీటిని తీసుకోండి. ఎక్కువ ఆల్కహాల్ ఎప్పుడూ ప్రమాదకరం కాబట్టి ఆల్కహాల్ ని లిమిట్ గా తీసుకోవడానికి చూడండి. ఒకవేళ ఎక్కువ తాగితే హాంగోవర్ వస్తుంది. ఆల్కహాల్ కి శరీరం నుంచి నీటిని పిలుచుకునే సామర్థ్యం ఉంటుంది. మద్యం సేవించాక ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. దీంతో డిహైడ్రేషన్ వంటి ఇబ్బందులు వస్తాయి. అలా ప్రమాదాలు జరగకుండా ఉండడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం.
ఒకవేళ నీటి కొరత ఏర్పడినట్లయితే తలనొప్పి, వికారం ఇలా అనేక ఇబ్బందులు వస్తాయి. మద్యం సేవించక కొంతమందికి నిద్ర పట్టదు. నిద్రలేమికి కారణం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మద్యాన్ని ఎక్కువ మోతలో తీసుకోవద్దు హ్యాంగోవర్ని నివారించడానికి ఉదయం పూట మంచి ఆహారాన్ని తీసుకోండి. కొన్ని సార్లు ఆల్కహాల్ రక్తం లో షుగర్ లెవెల్స్ ని తగ్గించేస్తుంది. హ్యాంగోవర్ లక్షణాలు కలుగుతాయి. నట్స్, జింక్, హోల్ గ్రైన్స్ తీసుకుంటూ ఉండాలి. పాలకు సంబంధించిన పదార్థాలను కూడా తీసుకుంటే హ్యాంగోవర్ తగ్గుతుంది.
పండ్ల ముక్కలను కూడా సలాడ్ గా చేసుకుని తీసుకోవచ్చు. అప్పుడు కూడా హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. అరటి పండ్లను ఎక్కువ తీసుకుంటే కూడా ఈజీగా బయటపడటానికి అవుతుంది. హ్యాంగ్ ఓవర్ నుంచి బయట పడడానికి డీహైడ్రేటెడ్ గా ఉన్నా మంచినీళ్ళని తాగండి. నీటి శాతం ఎక్కువ తీసుకుంటే ఇబ్బందులు రావు అలాగే తేనెను కూడా తీసుకోవచ్చు. తేనెను తీసుకుంటే కూడా హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. ఉదయం నిద్ర లేచాక అల్లం ముక్కని నమిలితే కూడా హ్యాంగ్ ఓవర్ సమస్య తగ్గుతుంది. లేదంటే అల్లం టీ చేసుకుని తీసుకోవచ్చు. పుదీనా కూడా ఈ సమస్యను పోగొడుతుంది. హ్యాంగ్ ఓవర్ లక్షణాలని నిమ్మకాయ కూడా తగ్గించగలవు. అలాగే టమాటాలు కూడా తీసుకోవచ్చు.