టెన్త్ ప్యాస్ అయినవారికి గుడ్ న్యూస్.. 399 కానిస్టేబుల్ ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సశాస్త్ర సీమ బల్‌లో (SSB) లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. టెన్త్ క్లాస్ ప్యాస్ అయినవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు.

జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక ఎవరు అర్హులు అనేది చూస్తే.. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకో వచ్చు. వయస్సు వివరాలను చూస్తే.. కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 23 సంవత్సరాలు ఉంటే అప్లై చేసుకోవచ్చు.

ఇక ఇది ఇలా ఉంటే దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 15. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ విధానం లో దరఖాస్తు చేసుకో వచ్చు. దరఖాస్తు ఫీజు చూస్తే.. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 100 ఫీజు కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు ఏమి లేదు. http://www.ssbrectt.gov.in/ లో పూర్తి వివరాలను చూడొచ్చు. అలానే అప్లై చేసుకో వచ్చు కూడా.

Link to apply: http://www.ssbrectt.gov.in/

 

Read more RELATED
Recommended to you

Exit mobile version