నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ప్రభుత్వ సంస్థ ఇస్రో లో భారీగా ఉద్యోగాలు..గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ అప్రెంటీస్‌గా పనిచేసే అవకాశం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్.. తాజాగా గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 70 పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలుస్తుంది..
పూర్తి వివరాలు..
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ – 17,
టెక్నికల్ అప్రెంటీస్- 30,
డిప్లొమా ఇన్ కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్ – 23
అర్హతలు..
సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.32 CGPAతో బీఈ, బీటెక్ పూర్తిచేసి ఉండాలి. డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ పాసై ఉండాలి..
అర్హులైన అభ్యర్థులు UMANG అధికారిక పోర్టల్ ద్వారా జూన్ 2వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, పాసింగ్ సర్టిఫికేట్, ఆల్ సెమిస్టర్స్ డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్స్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను అభ్యర్థులు ఇమెయిల్ ద్వారా ఒక ఫైల్ రూపంలో పంపాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు లెటెస్ట్ అప్‌డేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్‌మిట్ చేయాలి..
ఇస్రోకు చెందిన nrsc అధికారిక పోర్టల్ ద్వారా కూడా ఈ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా www.nrsc.gov.in పోర్టల్‌ను విజిట్ చేయాలి. హోమ్‌పేజీలో కెరీర్స్ ఆప్షన్‌లోకి వెళ్లి, ఆన్ లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అవసరమైన అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ నింపాలి. ఆ తరువాత అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి. ఎంపికయ్యే అభ్యర్థులు జాయినింగ్ సమయంలో మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సమర్పించాలి.. ఇక రూ.8000 నుంచి రూ. 9000 వరకు జీతం ఉంటుంది.. ఆసక్తి కలిగిన వాళ్ళు వెబ్ సైట్ ను పూర్తిగా సందర్శించి అప్లై చేసుకోగలరు..