తెలంగాణ మెడికల్‌ విద్యార్థులకు శుభవార్త..15 శాతం స్టైపెండ్ పెంపు

-

తెలంగాణ మెడికల్‌ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు స్టైపెండ్, సీనియర్ రెసిడెంట్లకు గౌరవ వేతనాన్ని ప్రభుత్వం 15% పెంచింది. ఎంబీబీఎస్, బిడిఎస్ హౌస్ సర్జన్లు, పిజి డిగ్రీ, డిప్లమా, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లుగా పనిచేస్తున్న వారందరికీ 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తించనుంది.

ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్టైపెండ్ పెంచినట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. స్టైపెండ్, గౌరవవేతనం పెంచినందుకు ప్రభుత్వానికి, మంత్రి హరీష్ రావు వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ కె.రమేష్ రెడ్డిలకు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ధన్యవాదాలు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version