నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ ను చెప్పింది.. తెలంగాణాలోని బీబీ నగర్ లో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు బీబీనగర్ ఎయిమ్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 94 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, అడిషనల్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు సంబంధించి ఈ ఖాళీలు ఉన్నాయి. ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ, అనాటమీ, పాథాలజీ, మైక్రోబయోలజీ, ఫార్మకాలజీ వంటి విభాగాలలో ఖాళీలను భర్థీ చేయనుంది..
ఖాళీల వివరాలు..
ప్రొఫెసర్లు 29
అడిషనల్ ప్రొఫెసర్లు 11
అసోసియేట్ ప్రొఫెసర్లు 18
అసిస్టెంట్ ప్రొఫెసర్లు 36
మొత్తం 94
వివరాలు..
మెడికల్ పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు టీచింగ్ లేదా రీసెర్చ్ అనుభవం ఉండాలని వెల్లడించారు. అభ్యర్థులు నాన్ మెడికల్ అయితే ఆయా సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ చేసిన వారై ఉండాలి.
మొత్తం వివరాలు..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://aiimsbibinagar.edu.in/ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న అనంతరం అప్లికేషన్ ఫామ్ ను బీబీనగర్ ఎయిమ్స్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.ఎం
ప్లాయిమెంట్ న్యూస్ లో ఈ ఉద్యోగ ప్రకటన వచ్చిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తుకు గడువు ఉంటుంది. అభ్యర్థులు ఆ తేదీలోపు తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు నోటిఫికేషన్ లో పూర్తీ వివరాలను చూడవచ్చు..